గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 అక్టోబరు 2022 (17:46 IST)

ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రత్యేక గుర్తింపు.. స్పెషల్ ఆర్టికల్ రాశారు..

rrrmovie
టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు దేశ విదేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా పేరు మారుమ్రోగిపోయింది.  
 
ఇటీవలే ఈ సినిమాకి హాలీవుడ్‌కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు సాధించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకి మరో గుర్తింపు లభించింది. 
 
వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ ఎంపైర్ మ్యాగజైన్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసి వారి మ్యాగజైన్‌లో ఆర్ఆర్ఆర్ గురించి స్పెషల్ ఆర్టికల్ రాశారు. 
 
ఎంపైర్ మ్యాగజైన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, రాజమౌళి డైరెక్షన్ గురించి గొప్పగా రాశారు. దీనిపై రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు.