గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (13:53 IST)

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ : ఆర్ఆర్ఆర్‌కు శాంటన్ అవార్డు..

rrrmovie still
ఆర్ఆర్ఆర్ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీతో పాటు విదేశాల్లోనూ రికార్డులు క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. 
 
తాజాగా శాటన్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్… మూడు విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’కు నామినేషన్ లభించింది. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ వస్తే చూడాలని యావత్ భారత ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు