బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (17:10 IST)

జపాన్ కు చెర్రీ దంపతులు.. ఎందుకెళ్లారంటే?

Upasana, Ramcharan
మెగా హీరో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం వారు జపాన్ వెళ్లారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు రూ.1,200 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. 
 
మరోవైపు ఇతర దేశాల భాషల్లోకి కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 21న ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతోంది. 
 
ఇందుకోసం చెర్రీ దంపతులు జపాన్ వెళ్లారు. ఇప్పటికే జపాన్ లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లయిట్ లో వీరు జపాన్ కు వెళ్లారు. తారక్, రాజమౌళి, ఇతరులు కూడా జపాన్ కు బయల్దేరనున్నారు. అందరూ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటారు.