శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (22:02 IST)

ఉపసానకు కోపం వచ్చిందా.. చెర్రీ అలా చెప్పాడా.. ఫన్నీ ఇన్సిడెంట్.. (వీడియో)

Ram charan_Upasana
Ram charan_Upasana
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో సందడి చేశారు. అయితే ఇందులో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మామూలుగా అయితే ఇద్దరిద్దరూ కూర్చునేందుకు స్పెషల్ సీటింగ్ అరేంజ్ చేస్తుంటారు. ముగ్గురు కూర్చునేది కూడా ఉంటుంది. ముందు రామ్ చరణ్ ఉపాసన కలిసి ఒకే దగ్గర కూర్చున్నారు.
 
తరువాత సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చి చేరినట్టున్నాడు. ఈ ముగ్గురూ ఒకే సోఫాలో కూర్చోవడంతో అసలు సమస్య వచ్చింది. రామ్ చరణ్‌ కాస్త అన్ కంఫర్ట్‌గా కూర్చున్నట్టున్నాడు. దీంతో ఉపాసనను పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. పక్కనే రామ్ చరణ్ తల్లి సురేఖ కూర్చుని ఉన్నారు. అయితే పక్కకు వెళ్లు.. అమ్మ దగ్గర కూర్చో అని చెప్పినట్టున్నాడు రామ్ చరణ్. దీంతో ఉపాసన మొహం ఒక్కసారిగా మారిపోయింది.
 
కాస్త కోపంగా చూస్తూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. పక్కనే ఉన్న సురేఖ పక్కన.. ఉపాసన కూర్చుంది. చరణ్‌ను చూసి నవ్వేసింది. ఇదంతా చూస్తున్న సాయి ధరమ్ తేజ ముసి ముసి నవ్వులు నవ్వేశాడు. చివరకు రామ్ చరణ్‌, సాయి ధరమ్ తేజ్ హాయిగా కూర్చున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్‌, ఉపాసనలకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.