గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:42 IST)

దేవుని ఆశీస్సులు వుంటాయంటూ చ‌ర‌ణ్‌కు దీవించిన‌ చిరంజీవి

charan-chiru
charan-chiru
దేవుడు నీ తోడు ఉండు గాక అంటూ రామ్ చ‌ర‌ణ్‌కు చిరంజీవి ఆశీర్వ‌దిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాక త‌న‌తో వున్న ఫొటో పెట్టి అభిమానుల‌తో సంతోషాన్ని పంచుకున్నారు. నేడు అనంగా సెప్టెంబ‌ర్ 28న చిరుత తొలి సినిమా 2007లో విడుద‌లైంది. అందుకే నేటికి రామ్‌చ‌ర‌ణ్ సినీ కెరీర్ 15ఏళ్ళ‌యింది. ఈ ప‌దిహేను ఏళ్ళ‌ఖు ఆర్‌.సి.15 సినిమా త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్‌.శంక‌ర్‌తో చేయ‌డం మ‌రింత ప‌రిణ‌తికి నిద‌ర్శ‌న‌మ‌ని చిరంజీవి అన్నారు.
 
`5 సంవత్సరాల మైలురాయిని చేరుకోవడంపై ప్రేమగా ఆస్వాదిస్తున్నాను.  ఎల్లప్పుడూ రామ్ చరణ్సి నిమాల్లో ప్రయాణం సాగించాల‌ని కోరుకుంటున్నాను. త‌ను చిరుత నుండి  మగధీర, రంగస్థలం , ఇటీవ‌లే ఆర్‌.ఆర్‌.ఆర్‌. వరకు  కెరీర్ సాగిపోతుంది. ఇప్పుడు దర్శకుడు శంకర్‌తో RC15కి ఎలా ఎదిగాడనేది హృదయపూర్వక‌మైన సంతృప్తి క‌లిగింది. 
 
చ‌ర‌ణ్‌ అభిరుచి,  శ‌రీరధారుడ్యం, అంకితభావం మరియు అతను చేసే పనిలో రాణించాలనే అతని సహజమైన కోరికపై చాలా సంతోషంగా ఉంది. నీ గురించి గర్విస్తున్నాను నా అబ్బాయి! మీ కోసం ఎదురుచూసే గొప్ప ఎత్తులు,  గొప్ప ఘనతలు ఇంకా ఉన్నాయి! దానికి వెళ్ళుతో మేమూ దేవుడు నీ తోడు ఉండు గాక! అంటూ ఆశీర్వ‌దించారు.