1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Indian Cricketers takes Dinner at Actor Ram Charan

భారత క్రికెటర్లకు టాలీవుడ్ హీరో చెర్రీ పసందైన విందు (Video)

Ram Charan
ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన భారత క్రికెటర్లకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పసందైన విందు ఇచ్చారు. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఇంటికి విందుకు రావాలని భారత క్రికెటర్లను చెర్రీ ఆహ్వానించాడు. దీంతో ఆదివారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లంతా చెర్రీ ఇంటికి వెళ్లారు. 
 
అక్కడ వారికి చరణ్ ప్రత్యేక విందు ఆతిథ్యాన్ని ఇచ్చారు. క్రికెటర్లను సన్మానించి వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ విందు కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సెలెబ్రిటీు పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 
తర్వాతి కథనం
హైదరాబాద్ వచ్చిన భారత క్రికెటర్లకు రామ్ చరణ్ పసందైన విందు (వీడియో)