విదేశాలనుంచి రామ్ చరణ్, ఉపాసన కొణిదెల + రైమ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొణిదెల తమ అందమైన పెంపుడు జంతువు రైమ్‌తో పాటు వారి సెలవుల నుండి తిరిగి వస్తున్నప్పుడు విమానాశ్రయంలో కనిపించారు. నేడు వారు బేగంపేట విమానాశ్రయంలో దిగారు. రామ్ చరణ్ తరచూ విహారా యాత్రలకు వెళుతుంటారు. ఈమధ్యే తన సోదరీమణులు, మేనకోడళ్ళతో వీకెండ్‌కు వెళ్ళి వచ్చారు. చరణ్ ఎప్పుడు వెళ్ళినా తమ పెంపుడు కుక్కపిల్లను చేతపట్టుకుని వెళుతుండడం విశేషం.
ఇక రామ్‌చరణ్ తాజా సినిమా ఆర్.సి.15 చిత్రం షూటింగ్‌లో పాల్గొనాల్సి వుంది. కొంత భాగం షూట్ కూడా అయింది. కాగా, ఇటీవలే దర్శకుడు శంకర్ ఇండియన్2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో వున్నారు. ఆ షెడ్యూల్ అయ్యాక ఆర్‌సి15 సెట్‌పైకి వెళ్ళనుంది. ఈలోగా తన తండ్రి చిరంజీవి చిత్రం గాడ్ ఫాదర్ దసరాకు విడుదకాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ముగింపు దశలో వున్నాయి. అవి కూడా చరణ్ చూసుకుంఉటన్నారని తెలిసింది. ఇక RC15 అనేది కార్తీక్ సుబ్బరాజ్ కథపై S. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.