గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (11:06 IST)

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్.. జపాన్ భాషలో మాట్లాడిన ఎన్టీఆర్

NTR
NTR
ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైంది. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా జపాన్‌లో విడుదలైన సందర్భంగా ఓ ప్రమోషన్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అభిమానులను అలరించారు. 
 
జపాన్ భాషలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మిమ్మల్ని చూడగానే జపాన్ భాషలో మాట్లాడాలని అనిపించిందని.. ఏవైనా తప్పులుంటే క్షమించాలని కోరారు జూనియర్ ఎన్టీఆర్. జపాన్ టూర్ ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అత్యంత సహృదయులైన ప్రజల ముంగిట తాను నిల్చుని వున్నానని చెప్పుకొచ్చారు.  
 
ఎన్టీఆర్ గతంలో నటించిన అనేక చిత్రాలు జపాన్‌లో విడుదలై ప్రజాదరణ పొందాయి. జపాన్‌లో ఆయనకు ఫ్యాన్స్ బేస్ వుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ విడుదల సందర్భంగా ఈ సినిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జపాన్‌లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ పర్యటిస్తోంది. 
 
ఇక ఎన్టీఆర్ అండ్ టీమ్ బస చేసిన హోటల్ ముందు అభిమానులు భారీగా గుమికూడారు. వారిలో ఓ మహిళా అభిమాని ఎన్టీఆర్‌ను చూడగానే భావోద్వేగాలకు గురై కన్నీళ్లు పెట్టుకుంది.