శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (14:28 IST)

ఏపీకి రూ.136 కోట్లు విడుదల చేసిన కేంద్రం..

andhra pradesh map
ఏపీకి తాజాగా రూ.136 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఏపీతో పాటు నాలుగు రాష్ట్రాలకు పట్టణాభివృద్ధి కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక ఏపీ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్ర ఈ సహాయం చేసింది. 
 
మొత్తంగా నాలుగు రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.1,764 కోట్లు విడుదల చేసింది. మొత్తం సొమ్ములో ఆంధ్రప్రదేశ్‌కు 136 కోట్ల రూపాయలు, ఛత్తీస్‌గఢ్‌కు 109 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 799 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్‌కు 720 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. 
 
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు దేశంలోని పలు ప్రధాన పట్ణణాల అభివృద్ధి కోసం కేంద్రం 4,761 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా ఏపీకి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 293.75 కోట్ల రూపాయల కేంద్రం ఆర్ధిక సహాయం విడుదల చేసింది. ఇక, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 331.40 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది.