శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (13:35 IST)

వివాదంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై

tamilisai
తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో వివాదంలో చిక్కుకున్నారు. గవర్నర్‌పై ప్రతిపక్షాలు హాట్ కామెంట్స్ చేశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ పొలిటికల్ మీటింగ్‌లో పాల్గొన్నట్లు ఆరోపిస్తున్నాయి. తమిళిసై రాజకీయ వేదిక పంచుకున్నారంటూ పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పోల్ స్ట్రేటజీ 2024 ఫర్ సౌత్ స్టేట్స్ పేరుతో ట్విట్టర్ స్పేసెస్‌లో బీజేపీ ఓ మీటింగ్ జరిగింది.

ఈ సమావేశంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, ఇటు నెటిజన్లు.. అటు రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీల కతీతంగా వ్యవహరించాల్సిన గవర్నర్, బీజేపీ ఎన్నికల వ్యూహ చర్చలో పాల్గొని.. బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.