గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (11:09 IST)

కాళ్లు చేతులు కట్టేసి.. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేశారు.. ఎక్కడ?

murder
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రింగు రోడ్డు సర్వీసు రహదారిపై గుర్తుతెలియని యువకుడిని కాళ్లు, చేతులు కట్టేసి తలకు ప్లాస్టిక్‌ కవర్‌ను చుట్టి చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య గురువారం తెల్లవారుజామున జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
ఇతర ప్రాంతాల్లో హతమార్చి ఇక్కడికి తెచ్చారా? ఇక్కడే హత్య చేశారా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెప్పారు. క్లూస్‌ టీంను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నామని ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. 
 
కాగా, ప్రేమ వ్యవహారం లేదా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువకుడు వయసు 30 ఏళ్లలోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.