మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (17:54 IST)

పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్న ఎన్టీఆర్?

Pawan_ntr
Pawan_ntr
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, ఎన్టీ రామారావు మనవడు, జూనియర్ ఎన్టీఆర్‌కు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఆగస్టు నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తారక్ ను కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాను కలిశారనే వార్త సోషల్ మీడియాలో తుఫానుగా మారింది. ఈ భేటీ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.
 
మరోవైపు ఎన్నికల్లో గెలుపొందేందుకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రజాసంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, అలాంటి నాయకుడు ప్రజలకు అవసరమని ఆర్‌ఆర్‌ఆర్ స్టార్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
 
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నందున ఇవి కేవలం రూమర్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు జనం. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా RRR ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే.