బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 19 అక్టోబరు 2022 (14:02 IST)

పవన్ పెళ్లిళ్లపై రచ్చ రచ్చ.. మీరూ చేసుకోండి.. ఎవరు వద్దన్నారు..

Pawan Kalyan
Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. పవన్ భార్యలలో పవన్ మొదటి భార్య పేరు నందిని. ఈమెను మెగా కుటుంబం నచ్చి మెచ్చి పవన్ కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే వీరిద్దరికి పడలేదు. 
 
అంతే ఆమెకు విడాకులు ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆమెకు భరణం కింద రూ.5కోట్లు ఇచ్చారు. ఆపై సినీ నటి రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లాడిన పవన్ ఆమెకు ఆస్తి మొత్తం రాసిచ్చారట. ప్రస్తుతం పవన్ తన మూడో భార్య అన్నా లెజినావో తో కలిసి ఉంటున్నారు. ఈ మూడు పెళ్లిళ్లపై పవన్ స్పందించారు. ఎప్పుడూ లేని విధంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు.  
 
మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్, ప్యాకేజ్ కళ్యాణ్ అన్నవారికి సరైన సమాధానం చెప్పానని పవన్ అన్నారు. తాను మూడు పెళ్లిళ్లు విడాకులు ఇచ్చి, వారికి భరణం కూడా ఇచ్చి విడిపోయినట్లు చెప్పుకొచ్చారు. 
 
మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి అంటూ ప్రశ్నించారు. మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారంటూ ఫైర్ అయ్యారు. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చి భరణంగా చెల్లించానని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్ వ్యాఖ్యలతో ప్రస్తుతం పవన్ భార్యలకు ఇచ్చిన భరణం హాట్ టాపిక్ గా మారింది.