1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (20:00 IST)

టైం, డేట్, ప్లేస్ చెప్తే నేను సింగిల్‌గానే వస్తాను... మంత్రి జోగి రమేష్

jogi ramesh
జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని నిమిషాల ముందే ముసుగు వీరుల ముసుగు తొలగిపోయిందని.. ఎప్పట్నుంచో తాము చెప్తున్నట్టుగా ముసుగు దొంగలిద్దరు ఒక చోట చేరిపోయారని విమర్శించారు. ప్రజలకి కూడా వీళ్ళ నిజ స్వరూపం తెలిసిపోయిందన్నారు. 
 
పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజ్ కళ్యాణ్ అని తాను ఇప్పుడు కూడా చెప్తున్నానని.. ప్యాకేజ్ 'స్టార్' అనడం కొంత ఇబ్బందేనని సెటైర్లు వేశారు. సినిమాలో నటించే విధంగానే రాజకీయాల్లోనూ నటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ తీసుకోకపోతే.. ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రి అవుతానని ధైర్యంగా చెప్పావా? అని పవన్‌ని నిలదీశారు. 
 
నువ్వు చూపించిన చెప్పు ఇంతకు నీదేనా? లేక నీ యజమాని కొనిచ్చాడా? అంటూ పవన్‌ను జోగి రమేష్ ప్రశ్నించారు. 2019లో ఏపీ ప్రజల్ని మిమ్మల్ని చెప్పులు అరిగేటట్లు, చెంపలు చెళ్లుమనిపించారని.. ఎన్నికల్లో యుద్ధం చేసి ఓడిపోలేదా? అని అడిగారు. 
 
పవన్ చేతికి నిన్న ఎక్కువ ప్యాకేజీ అందినట్లుందని.. అందుకే ఎక్కువ మాట్లాడేశాడని ఆరోపించారు. విశాఖ గర్జన సక్సెస్ అవ్వడంతో.. తమపై పవన్ దాడి చేయించాడని ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ పిచ్చికుక్క అని.. ఆయన వాగుడుతో అది తేటతెల్లమైందని తెలిపారు. 
 
వైసీపీ సిద్ధాంతం మూడు రాజధానులైతే.. పవన్ కళ్యాణ్‌ది మూడు పెళ్లాలా సిద్ధాంతమని విమర్శించారు. పొద్దున బీజేపీకి విడాకులిచ్చి.. ఇప్పుడు చంద్రబాబును మరోసారి పెళ్లి చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. 
 
అధికారం కోసం ఏ పార్టీనైనా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు ఇవ్వడమే వీళ్ల సిద్ధాంతమని సెటైర్లు సంధించారు. ప్రజల గుండెల్లో ఉన్న జగన్‌ని ఓడించాలనేదే పవన్, చంద్రబాబు లక్ష్యమని.. అయితే వారి తపన అలాగే మిగిలిపోతుందని జోగి రమేష్ తెలిపారు. 
 
ఎంతమంది కలిసొచ్చినా జగన్‌ని కదల్చలేరన్నారు. తమకూ ఖలేజా ఉందని, తమకూ అన్ని వచ్చని అన్నారు. చంద్రబాబు ఇంటికే వెళ్లిన వాళ్లమని.. టైం, డేట్, ప్లేస్ చెప్తే తాను సింగిల్‌గానే వస్తానని.. అప్పుడు తేల్చుకుందామని సవాల్ విసిరారు.