సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (15:24 IST)

ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరా నాకు చెప్పేది.. : పవన్ కళ్యాణ్

pawan kalyan
వైకాపా నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రత్యక్ష యుద్ధానికి "సై" అన్నారు. ప్రత్యక్ష పోరాటం చేసేందుకు సిద్ధమని ప్రటించారు. ఒక పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే మీరా నన్ను అనేది అంటూ ప్రశ్నించారు. 
 
మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తాను లండన్‍‌‌లోనో, న్యూయార్క్‌లోనో పెరగలేదని... బాపట్లలో పుట్టానని.. గొడ్డుకారం తిన్నానని పవన్ అన్నారు. వీధి బడిలో చదువుకున్నానని చెప్పారు. 
 
మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటున్నారని... మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండిరా ఎవడొద్దన్నాడు అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తొలి భార్యకు రూ.5 కోట్ల డబ్బిచ్చానని, రెండో భార్యకు మిగతా ఆస్తి ఇచ్చానని ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నానని, విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. 
 
ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టెపినీలతో తిరిగే మీకేందిరా నేను చెప్పాది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. చొక్కా పట్టుకుని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతా కొడకల్లారా అని హెచ్చరించారు. 
 
తాను కానిస్టేబుల్ కొడుకునని, ఐపీఎస్ ఆఫీసర్ కొడుకును కాదని... మాంచి ఇంగ్లీష్ తనకు రాదని, ముతక భాష వచ్చని... సంస్కారం ఉంది కాబట్టే ఇంత కాలం మూసుకుని ఉన్నానని పవన్ అన్నారు. మీకు మంచి పని చేయదని, శిక్షించడమే కరెక్ట్ అని చెప్పారు. 
 
వెధవలు అంటే వైసీపీలో ఉన్న అందరూ కాదని... బాలినేని శ్రీనివాస్, ఆనం రాంనారాయణ రెడ్డిలాంటి మంచి వ్యక్తులు కూడా ఆ పార్టీలో ఉన్నారని అన్నారు. అలాంటి మంచి వ్యక్తులుకాకుండా బూతులు మాట్లాడే ప్రతి కొడుక్కి చెపుతున్నా.. నుంచోబెట్టి తోలు ఒలుస్తా అందరికీ అని వార్నింగ్ ఇచ్చారు. 
 
తనకు రాజకీయం తెలియదనుకున్నారా అని ప్రశ్నించిన ఆయన... మీరు క్రిమినల్ పాలిటిక్స్ చేస్తారని, తాను బలమైన సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పారు. యుద్ధానికి సిద్ధమని మీరు చెపితే... రాళ్లా, హాకీ స్టిక్సా దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. 
 
ఎంతమంది వైసీపీ గూండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో రండిరా ఛాలెంజ్ విసురుతున్నా అని అన్నారు. ఇప్పటి వరకు పవన్ మంచితనం, సహనం చూశారని... ఈరోజు నుంచి యుద్ధమేనని చెప్పారు.