శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (13:58 IST)

ఢిల్లీ లిక్కర్ స్కాములో వైకాపా ఎంపీ తనయుడి వద్ద విచారణ

magunta srinivasulu reddy
ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో ఏపీకి చెందిన అధికార వైకాపాకు చెందిన ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి వద్ద సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ స్కాములో మాగుంట కుమారుడి వద్ద విచారించడం ఇపుడు ఏపీలో కలకలం చెలరేగింది. 
 
కాగా, ఢిల్లీ స్కాములో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, తెలంగాణాలోను పది బృందాలు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నాయి. 
 
ఇదిలావుంటే, లిక్కర్ స్కాములో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను కూడా సీబీఐ అధికారుల సోమవారం విచారణకు పిలవగా, ఆయన హాజరయ్యారు. ఆయనతో పాటు అరుణ్ పిళ్లైని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 
 
అలాగే ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది. మాగుంట కుమారుడిని ప్రశ్నిస్తుండటం ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ఫార్మా కంపెనీ ఎండీని సైతం సీబీఐ విచారిస్తోంది.