శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 అక్టోబరు 2022 (22:50 IST)

హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించిన వాటర్‌ యుటిలిటీ స్టార్టప్‌ బోసన్‌ వైట్‌ వాటర్‌

Boson
శుద్ధి చేసిన వ్యర్థజలాలను (ఎస్‌టీపీ వాటర్‌)ను అత్యున్నత నాణ్యత కలిగిన తాగు నీటిగా మార్చే కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, బెంగళూరు కేంద్రంగా కలిగిన  వాటర్‌ యుటిలిటీ కంపెనీ బోసన్‌ వైట్‌ వాటర్‌ తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. బోసన్‌ వైట్‌ వాటర్‌ ఇప్పుడు ఐఓటీ , ఏఐ ఆధారిత 11 అంచెల ఫిల్ట్రేషన్ వ్యవస్థలను అందిస్తుంది. వీటి ద్వారా పలు భౌతిక, రసాయన, జీవ వ్యర్థాలను శుద్ధి చేసిన వ్యర్థ జలాల నీటి నుంచి తొలగించడం చేస్తుంది.
 
ఐటీ పార్కులు, పరిశ్రమలు, మాల్స్‌, అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీలు వ్యర్థ జలాలు రీసైకిల్‌ చేసే విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలనే మహోన్నత లక్ష్యంతో బోసన్‌ వైట్‌ వాటర్‌ సంస్ధను వికాస్‌ బ్రహ్మావర్‌ మరియు గౌతమన్‌ దేశింగ్‌ ప్రారంభించారు. ప్రస్తుతం బెంగళూరులో  అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీలు, మాల్స్‌లు, పరిశ్రమలతో కలిసి పనిచేస్తూ 35 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసింది. ఈ స్టార్టప్‌ ఇప్పుడు హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్‌ కమ్యూనిటీలతో చర్చలు జరుపుతుంది.
 
హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం గురించి బోసన్‌ వైట్‌ వాటర్‌ సీఈఓ మరియు కో-ఫౌండర్‌ వికాస్‌ బ్రహ్మావర్‌ మాట్లాడుతూ, ‘‘ఇండియా వాటర్‌ సిస్టమ్స్‌కు చెందిన శ్రీకాంత్‌, బృందం మద్దతుతో హైదరాబాద్‌లో మా కార్యకలాపాలు ప్రారంభించాము. నగరాలలో నీటి సమస్యను తగ్గించాలన్నది మా ప్రయత్నం. బెంగళూరులో గణనీయమైన ప్రభావం చూపిన మా ఉత్పత్తి హైదరాబాద్‌లో కూడా అదే తరహా ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.