1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (09:51 IST)

తెలుగు రాష్ట్రాల్లో బంగారం - వెండి ధరలు ఎలా ఉన్నాయి?

gold
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ఈ ధరలు మంగళవారం మాత్రం స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 
 
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం ఈ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. గ్రాము బంగారం ధర మంగళవారం రూ.4,760 వుండగా, పది గ్రాముల బంగారం ధర రూ.47,600గా ఉంది. 
 
24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారంతో పోలిస్తే మంగళవారం ధర గ్రాముకు రూ.27 మేరకు తగ్గింది. ఫలితంగా గ్రాము బంగారం ధర రూ.5,193గా ఉండగా, 10 గ్రాముల బంగారం ధర రూ.51,930గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో కూడా కొనసాగుతున్నాయి. 
 
ఇకపోతే, ఢిల్లీలో 22, 24 క్యారెట్ల బంగారం ధరను పరిశీలిస్తే, 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.4,775గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.5,210గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.52,100గా ఉంది. 
 
దేశ రాజధాని ముంబైలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.4,760గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.47,600గా ఉంది. చెన్నైలో గ్రాము బంగారం ధర రూ.4,805గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.48,050గా ఉంది. అలాగే, వెండి ధరల్లో కూడా స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మంగళవారం కిలో వెండి ధరపై రూ.1,200 తగ్గగా, కేజీ వెండి ధర రూ.64,800గా ఉంది.