ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (16:23 IST)

యాదాద్రి ఆలయానికి కేజీ బంగారం విరాళమిచ్చిన సీఎం కేసీఆర్

kcr couple
తెలంగాణాలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి కేసీఆర్ దంపతులు కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. 
 
శుక్రవారం ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఒక కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడైన హిమాన్షు అందజేశారు. స్వామి వారి దర్శనం తర్వాత సీఎం దంపతులను ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు శేఖర్ రెడ్డి, సునీత, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. స్వామి వారి దర్శనానికి ముందు యాదాద్రి కొండ దిగువన ఉన్న ప్రెసిడెన్సియల్ సూట్‌లో వైటీడీఏ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.