శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (20:24 IST)

లాడ్జీలో వ్యభిచారం: ఐదుగురి అరెస్ట్.. ఎక్కడ?

ఎల్‌బీనగర్ కామినేని హాస్పిటల్‌ వద్ద లాడ్జీలో వ్యభిచారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాడ్జీ యజమానితో పాటు ఐదుగురిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. ఎల్‌బీనగర్‌ కామినేని హాస్పిటల్‌ ఎదురుగా కర్నాటి రామారావు అనే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర లాడ్జీని నిర్వహిస్తున్నాడు. సెక్స్‌ వర్కర్లను నియమించుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 
అయితే ఎల్‌బీనగర్‌ పోలీసులు వెంకటేశ్వర లాడ్జీపై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు విటులు దేవరాజు, మాణిక్‌ స్వరూప్, కర్నూల్‌ ప్రాంతాన్ని చెందిన ఒక మహిళ, నల్గొండ జిల్లా డిండికి చెందిన మరో మహిళ పట్టుబడ్డారు. లాడ్జీ నిర్వాహకులు కర్నాటి రామారావు, సహదేవ్‌ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.