శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (09:01 IST)

దూసుకుపోతున్న బాలయ్య - చంద్రబాబు "అన్‌స్టాపబుల్ 2" ప్రోమో

unstoppable
ఆహా ఓటీటీ కోసం హీరో బాలకృష్ణ ప్రధాన హోస్ట్‌గా చేస్తున్న టీవీ కార్యక్రమం "అన్‌స్టాపబుల్" రెండో సీజన్ మొదలైంది. ఇందులో తొలి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ "అన్‌స్టాపబుల్-2'' షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనికి కేవలం 3 గంటల్లో 11 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ ఎపిసోడ్‌కు అతిథులుగా చంద్రబాబు, నారా లోకేష్‌కు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
కేవలం 2 గంటల 50 నిమిషాల్లో ఈ ప్రోమో వీడియోకు ఏకంగా 11 లక్షల వ్యూస్ వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి ఎదురైన క్లిష్ట పరిస్థితులతో పాటు చంద్రబాబు జీవితంలో చోటుచేసుకున్న సరదా సంఘటనలు, బాలయ్య వెల్లడించిన ఆసక్తికర అంశాలు, తన రాజకీయ ప్రస్థానంపై నారా లోకేశ్ చేసిన కామెంట్లతో కూడిన ఈ ప్రోమో సోషలో మీడియాలో వైరల్ అయింది.