మహేష్‌బాబు తల్లి ఇందిరమ్మ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ
ఇటీవలే అనారోగ్యంతో కాలం చేసిన మహేష్‌బాబు తల్లి ఇందిరమ్మకు నేడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. అక్టోబర్ 8వ తేదీ శనివారంనాడు 11వ రోజున ఇందిరమ్మ కుటుంబ సభ్యులు కర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ హాజరై కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మహేష్‌బాబుతో వారి అమ్మగారి గురించి పూర్తివివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలకృష్ణ ఆమె ఫొటోకు నమస్కరించి నివాళుర్పించారు.
11వ రోజు వేడుకలో ఇందిరమ్మ గారికి నివాళులు అర్పించిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. జి. ఆదిశేషగిరిరావు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పరిమితంగా 11వరోజు కార్యక్రమం నిర్వహించారు.
కృష్ణ అభిమానులు కూడా వివిధ ప్రాంతాలలో తగు విధంగా ఇందిరాదేవీని తలచుకుంటూ నివాళులర్పిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.