గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (21:13 IST)

దీపావళి కానుక.. ఏడాదికి ఉచిత సిలిండర్లు..

lpg cylinder
గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏడాదికి ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో పౌరులు, గృహిణులకు రూ. వెయ్యికోట్ల ఉపశమనం లభిస్తుందని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వాఘాని సోమవారం ప్రకటించారు. ఏడాదిలో రెండు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. 
 
గుజరాత్‌లో 38 లక్షల మంది గృహిణులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం నిర్ణయించిన రూ.650 కోట్లతో గుజరాత్‌లోని ప్రతి ఇంటికి దాదాపు రూ.1,700 వరకు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు.
 
సీఎన్‌జీలో 10 శాతం తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే కిలోకు రూ.6-7 వరకు ప్రయోజనం ఉంటుందని వాఘా చెప్పారు. అదేవిధంగా పీఎన్‌జీపై కిలోకు రూ.5-5.50 వరకు ప్రయోజనం ఉండబోతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన చాలా పెద్దదని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా కూడా భావిస్తోందన్నారు.