మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (18:12 IST)

అల్లు అర్జున్ పుష్పకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

allu arjun award
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022' పురస్కారాన్ని గెలుచుకున్నాడు. వినోద రంగంలో అల్లు అర్జున్‌ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.
 
'ఇండియన్‌ ఆఫ్ ది ఇయర్‌' ఘనత సాధించిన తొలి దక్షిణాది నటుడు అల్లు అర్జున్‌ కావడం గమనార్హం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదగా బన్నీ ఈ అవార్డు తీసుకున్నాడు. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'మనమంతా భారత చలనచిత్ర రంగానికి బిడ్డలం. ఇది భారతదేశ సినిమా విజయం. కష్ట సమయాల్లో వినోదంతో దేశానికి సేవ చేయగలిగినందుకు గర్విస్తున్నాను. ఈ అవార్డును కొవిడ్‌ వారియర్స్‌కు అంకితమిస్తున్నా' అని చెప్పారు.