శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (18:45 IST)

స్నేహితురాలిపై అఘాయిత్యం.. మత్తుమందిచ్చి తొమ్మిదిరోజులు..

rape
మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. ఓ కామాంధుడు స్నేహితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తినే పదార్థాల్లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అమ్మాయి అపస్మారకస్థితిలోకి జారుకోగానే తాను అనుకున్న పని చేశాడు. 
 
ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9 రోజుల పాటు ఆమెను నిర్బంధించి అత్యాచారం చేశాడు. చివరకు స్పృహలోకి వచ్చిన యువతి.. ఎలాగోలా ఆ కీచకుడి చెర నుంచి బయటపడింది. పంజాబ్‌లోని లుధియానాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. లుధియానాలోని హతుర్‌కు చెందిన జస్పాల్ సింగ్, బాధిత యువతి (26) ఇద్దరూ స్నేహితులు. అయితే, తన దుబాయ్ ట్రిప్ కోసం షాపింగ్ చేయడానికి సహాయం కావాలని, సెప్టెంబర్ 30వ తేదీన రాయికోట్‌కు రావాలని యువతిని కోరాడు. 
 
దాంతో స్నేహితుడే కదా అని నమ్మిన యువతి అతని కోసం రాయికోట్‌కు వెళ్లింది. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం.. మత్తు మందు ఇచ్చిన ఆహారాన్ని ఆమెతో తినిపించాడు. దాంతో యువతి అపస్మారకస్థితికి చేరుంది.
 
మరో ఇద్దరు స్నేహితులతో కలిసి యువతిని ఉత్తరప్రదేశ్‌లోని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నాటి నుంచి 9 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
మొత్తానికి అతని చెర నుంచి తప్పించుకుని స్వగ్రామానికి వచ్చిన యువతి.. కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు, చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.