గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (16:44 IST)

నోవాటెల్ హోటల్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిసిన చంద్రబాబు

pawan - chandrababu naidu
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. విజయవాడ నగరంలోని నోవాటెల్ నక్షత్ర హోటల్‌లో ఈ భేటీ జరిగింది. పవన్ బస చేసిన నోవాటెల్‌ హోటల్‌కు వచ్చిన చంద్రబాబు.. విశాఖలో జరిగిన ఘటనలపై చర్చించినట్లు సమాచారం. 
 
గత రెండు రోజులుగా విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలు, పవన్‌ పట్ల పోలీసులు వ్యహహరించిన తీరు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. 
 
అంతేకాకుండా, 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పనన్‌ రాజకీయ అంశంపై భేటీ కావడం గమనార్హం. అయితే, మధ్యలో ఓ వివాహ కార్యక్రమంలో కూడా వీరిద్దరూ కలుసుకున్నారు.
 
కాగా, గత 2014లో పొత్తు ప్రకటించి ఎన్నికల్లో తెదేపాకు పవన్‌ మద్దతిచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.