ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (23:01 IST)

కాంతారాపై కంగనా రనౌత్ ఏమంది.. 'ఓ' శబ్ధాన్ని అలా వాడకండి..? (video)

kangana
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతారా'పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడే సినిమా చూశానని.. ఇప్పటికీ శరీరం వణికిపోతోందని చెప్పింది. ఈ చిత్రాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభవమన్నారు. జానపద కథలు, సంప్రదాయాలు, దేశీయ సమస్యల కలయికే కాంతారా అని వెల్లడించింది. 
 
'రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్ అంటూ అభినందనలు తెలియజేసింది. రచన, దర్శకత్వం, నటన, యాక్షన్ అంతా అద్భుతం. నమ్మలేకపోతున్నా. సినిమా అంటే ఇలా వుండాలని కాంతారాను ఆకాశానికెత్తేసింది కంగనా రనౌత్. ఇలాంటి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి తాను బయటకు రాలేనని అనుకుంటున్నట్లు కంగనా వెల్లడించింది. వచ్చే ఏడాది భారత్‌కు ఓ ఆస్కార్ ఖాయమని కంగనా రనౌత్ జోస్యం చెప్పింది. 
 
మరోవైపు ప్రాచీన భూత కోల అనే ప్రాచీన ఆచారాన్ని కాంతారాలో చూపించారు. దైవ నర్తకులు ఈ భూత కోలను ప్రదర్శిస్తూ 'ఓ' అని అరుస్తారు. కాంతార చిత్రంలో ఈ అరుపులను స్పెషల్ ఎఫెక్ట్స్‌తో రికార్డు చేశారు. వీటిని థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు బయటికి వచ్చిన తర్వాత కూడా 'ఓ' అని అరుస్తూ తమ క్రేజ్‌ను వెల్లడిస్తున్నారు. 
Kanthara
Kanthara
 
 


దీనిపై కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్పందించారు. కాంతార చిత్రంలో 'ఓ' అనే అరుపు ఒక ఆచార, సంప్రదాయానికి సంబంధించినదని, దాన్ని ఎవరూ బయట అరవొద్దని విజ్ఞప్తి చేశారు. 'ఓ' అనే అరుపును తాము శబ్దంగానే కాకుండా, ఓ సెంటిమెంట్‌గా భావిస్తామని స్పష్టం చేశారు.