గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (18:18 IST)

రోజుకు రూ.3 కోట్లు చొప్పున విరాళమిస్తున్న టెక్ దిగ్గజం!

shiv nadar
దేశంలోని దిగ్గజ టెక్ కంపెనీల్లో ఒకటైన హెచ్.సి.ఎల్. వ్యవస్థాపక అధ్యక్షుడు శివ్ నాడార్ దాతృత్వంలో అగ్రస్థానంలో నిలించారు. ఈయన రోజుకు రూ.3 కోట్లు చొప్పున విరాళం ఇచ్చారు. గత 2021-22 సంవత్సరంలో ఏకంగా 1,161 కోట్ల మేరకు విరాళం ఇచ్చారు. అంటే సగటున రూ.3 కోట్ల మేరకు ఆయన విరాళంగా ఇచ్చారు. 
 
ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2022 జాబితాలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానానికి చేరారు. వరసగా రెండు సంవత్సరాల పాటు ఈ జాబితాలో ప్రేమ్‌జీ ఈసారి తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 
 
ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ రూ.190 కోట్ల విరాళంతో జాబితాలో ఏడోస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 15 మంది శ్రీమంతులు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చారు. ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ ఛైర్మన్‌ రూ.142 కోట్లతో దేశంలోనే అత్యధిక విరాళం ఇచ్చిన ప్రొఫెషనల్‌ మేనేజర్‌గా నిలిచారు.