1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (15:05 IST)

ఆ వేగంలో భారత ర్యాంక్ పడిపోయింది..

Bradband
Bradband
భారత ర్యాంక్ బ్రాడ్ బ్యాండ్ వేగంలో పడిపోయింది. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్ లో బ్రాండ్ బ్యాండ్ వేగం తగ్గింది. డౌన్ లోడ్ వేగం సెప్టెంబరులో కాస్త పెరిగినా.. ర్యాంకు మాత్రం పడిపోయింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత స్థానం 118 నుంచి 117కి తగ్గిపోయింది. 
 
అలాగే ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ లోనూ భారత్ 79వ ర్యాంకు నుంచి 78వ ర్యాంకుకు పరిమితమైంది. ఆగస్ట్ లో బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగం 48.29 ఎంబీపీఎస్ ఉంటే, సెప్టెంబర్ లో 48.59 ఎంబీపీఎస్ కు పెరిగింది. రిలయన్స్ జియో 5జీ నెట్ వర్క్ ఢిల్లీలో 600 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగాన్ని చూపించింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో, చైనాలోని షాంఘై పట్టణం  అగ్ర స్థానంలో ఉంది.