1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (11:07 IST)

మొబైల్ ఫోను చోరీ చేశాడనీ బావిలో వేలాడదీశారు.. ఎక్కడ?

boy hang in well
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ బాలుడుని స్థానికులు బావిలో వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. 
 
ఛతర్‌పుర్, లవ్‌కుశ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అత్కోహన్‌లో ఓ యువకుడు మొబైల్‌ ఫోన్‌ దొంగిలించాడన్న ఆరోపణతో నిండా నీళ్లు ఉన్న బావిలో బాలుడిని వేలాడదీసి విచారించారు. తాను దొంగతనం చేయలేదని బాలుడు రోదిస్తున్నా స్థానికులు పట్టించుకోలేదు. 
 
ఈ అమానుష సంఘటనను మరో యువకుడు దొంగచాటుగా వీడియో తీశాడు. సాయంత్రం బాధితుడి తల్లిదండ్రులకు ఆ వీడియో చూపించాడు. వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే వీడియో వైరల్‌ కాగా.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదేసమయంలో వీడియో తీసిన యువకుడిని కూడా వారు చితకబాదారు.