సంబంధిత వార్తలు
- వేప చెట్టునుంచి కారుతున్న పాలు.. లీటర్ల పాటు ఇంటికెత్తుకెళ్లారు...
- భార్యాభర్తలకు సూపర్ ఆఫర్.. నెలకో పిజ్జా ఫ్రీ...
- భారీగా పెరిగిన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం
- దేశవ్యాప్తంగా రక్తపోటు (హైపర్‌టెన్షన్) పట్ల గ్లెన్‌మార్క్ ప్రజా అవగాహన కార్యక్రమాలు
- హిందీ భాషలో ఎంబీబీఎస్ కోర్సు.. పాఠ్యపుస్తకాలు ముద్రణ పూర్తి
'భార్య మార్పిడి క్రీడ'కు నిరాకరించిన వైఫ్.. దారుణానికి ఒడిగట్టిన భర్త
ఓ భర్త కట్టుకున్న భార్యను మరో పురుడికి పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంటే భార్య మార్పిడి క్రీడ ఆడాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ససేమిరా అంది. అంతే ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి దాడి చేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో వెలుగు చూసింది.
తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమ్మర్ అనే వ్యక్తి బికనేర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్యను హోటల్‌కు తీసుకొచ్చి ఆమె వద్దనున్న సెల్‌ఫోన్ లాక్కుని గదిలో బంధించాడు.
భార్యల మార్పిడి గేమ్ ఆడాలని కోరాడు. అందుకు నిరాకరించడంతో ఆమెపై దాడి చేశాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొచ్చిన బాధితురాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అమ్మర్‌కు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, రూ.50 లక్షల అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
