శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (15:47 IST)

వేప చెట్టునుంచి కారుతున్న పాలు.. లీటర్ల పాటు ఇంటికెత్తుకెళ్లారు...

Neem milk
Neem milk
అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతూనే వుంటాయి. గతంలో వినాయకుడు పాలు తాగిన ఘటన గుర్తే వుండి వుంటుంది. అలాగే చెట్ల నుంచి పాలు కారడం కూడా వినే వుంటాం.  తాజాగా, మధ్య ప్రదేశ్‌లో ఓ వేప చెట్టునుంచి పాలు కారుతున్న సంఘటన వెలుగు చూసింది. 
 
దీంతో జనం చెట్టు దగ్గర పూజల కోసం క్యూ కట్టారు. కొంతమంది లీటర్ల కొద్ది పాలను ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌, సింగరౌలీ జిల్లా నిగాహి గ్రామంలో ఓ వేప చెట్టునుంచి ఉన్నట్టుండి పాలు కారటం మొదలైంది.
 
అది కూడా చుక్కలు చుక్కలుగా కాదు.. ధారాపాతంగా కారటం మొదలైంది. ఇది చూసిన జనం చెట్టు దగ్గర క్యూలు కట్టారు. చెట్టు దగ్గర పెద్ద ఎత్తున పూజలు చేయటం మొదలుపెట్టారు. 
 
షీత్లా మాత మహిమ కారణంగానే ఇలా వేప చెట్టునుంచి పాలు కారుతున్నాయని జనం అంటున్నారు. పాలు కారుతున్న చెట్టుకు చాలా ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నామని చెబుతున్నారు. 
 
ఆ పాలు ఆరోగ్యానికి చాలా మంచివని, అవి తాగితే ఆరోగ్య సమస్యలన్నీ తొలుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం వేప చెట్టు నుంచి పాలు కారుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.