క్లీన్ సిటీస్ జాబితాలో ఐదో స్థానానికి దిగజారిన విజయవాడ
దేశంలో స్వచ్ఛ భారత్ కింద నగరాలను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన క్లీన్ సిటీస్ (పరిశుభ్ర నగరాలు) జాబితాలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే, ఏపీకి మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గత యేడాది మూడో స్థానంలో ఉన్న విజయవాడ నగరం ఈ దఫా రెండు స్థానాలు కోల్పోయి ఐదో స్థానానికి దిగజారింది.
అయితే, దేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాలో తొలి పది నగరాల్లో ఏపీలో మూడు నగరాలకు చోటుదక్కింది. వీటిలో విజయవాడ నగరం ఐదో స్థానంలో ఉండగా, విశాఖపట్టణం, తిరువతి నగరాలు వరుసగా 4, 7 స్థానాల్లో నిలిచాయి.
అదేసమయంలో ఈ స్థానంలో గడిచిన ఐదేళ్లుగా తొలి స్థానంలో నిలిచిన ఇండోర్.. ఈ దఫా కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అంటే ఆరో యేడాది కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో సూరత్, నవీ ముంబైలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక క్లీన్ సిటీస్ నగరాల్లో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలువగా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు తర్వాత స్థానాల్లో నిలిచాయి.