దేశవ్యాప్తంగా రక్తపోటు (హైపర్‌టెన్షన్) పట్ల గ్లెన్‌మార్క్ ప్రజా అవగాహన కార్యక్రమాలు
ఆవిష్కరణ ఆధారిత, గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (గ్లెన్‌మార్క్) ప్రపంచ హృదయ మాసాన్ని సెప్టెంబర్ నెలలో నిర్వహించింది. దీనిలో భాగంగా 300 హైపర్‌టెన్షన్ ప్రజా అవగాహన ర్యాలీలు, 8 వేలకు పైగా హైపర్‌టెన్షన్ స్ర్కీనింగ్ క్యాంప్‌లను దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 42 నగరాలలో 8వేల మందికి పైగా డాక్టర్లు, 10వేల మందికి పైగా హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌తో భాగస్వామ్యం చేసుకుని 10 కోట్ల మంది భారతీయులను చేరుకోవడం లక్ష్యంగా చేసుకుంది. ఈ ర్యాలీలను దేశవ్యాప్తంగా పలు హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం చేసుకుని నిర్వహించింది. హైదరాబాద్, చెన్నైలలో 13 అవగాహన ర్యాలీలలను దీనిలో భాగంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమాలను గురించి గ్లెన్‌మార్క్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్- హెడ్ ఆఫ్ ఇండియా ఫార్ములేషన్స్, అలోక్ మాలిక్ మాట్లాడుతూ, దేశంలో రక్తపోటు పట్ల అవగాహన కల్పించాలనే మా ప్రయత్నాలలో భాగం ఈ కార్యక్రమాలు. కార్డియోవాస్క్యులర్ డిసీజ్ (సీవీడీ) ప్రమాదాలకు కారణం కావడంతో పాటుగా హైపర్‌టెన్షన్ చాలామందిలో నిశ్శబ్ద హంతకిగా ఉంటుంది. రక్తపోటు నిర్వహణలో అగ్రగామిగా గ్లెన్‌మార్క్ ఇప్పుడు ఈ వ్యాధితో పోరాటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుంది అని అన్నారు.
గ్లెన్‌మార్క్ ఇప్పుడు రక్తపోటు పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా టేక్ చార్జ్ ఎట్ 18 ప్రచారం నిర్వహించడం ద్వారా 18 సంవత్సరాలు దాటిన పెద్ద వయసు వారికి పరీక్షలు నిర్వహించింది.