1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (23:22 IST)

టైప్‌ 2 మధుమేహుల కోసం ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ ఔషదం టెనెలిగ్లిప్టిన్‌ ప్లస్ పియోగ్లిటజోన్‌

ఆవిష్కరణల ఆధారిత ఫార్మాస్యూటికల్‌ కంపెనీ, గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (గ్లెన్‌మార్క్‌), విప్లవాత్మక ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) డీపీపీ4 ఇన్హిబిటర్‌ (డిపెప్టిడిల్‌ పెప్టిడస్‌ 4 ఇన్హిబిటర్‌) పియోగ్లిటజోన్‌తో కూడిన టెనెలిగ్లిప్టిన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో అనియంత్రిత టైప్‌ 2 మధుమేహుల కోసం అందుబాటులో ఉన్న ఒకే ఒక్క డీపీపీ4 మరియు గ్లిటజోన్‌ కాంబినేషన్‌ ఔషదం ఇది. గ్లెన్‌మార్క్‌ ఈ ఎఫ్‌డీసీని జిటాప్లస్‌పియో బ్రాండ్‌ పేరిట విడుదల చేసింది. దీనిలో టెనెలిగ్లిప్టిన్‌ (20ఎంజీ)+పియోగ్లిటజోన్‌(15ఎంజీ) ఉంది. దీనిని రోజుకు ఒకసారి వాడవలెను.
 
ఈ ఔషద ఆవిష్కరణ గురించి గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇండియా ఫార్ములేషన్స్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్- అలోక్‌ మాలిక్‌ మాట్లాడుతూ, ‘‘గ్లెన్‌మార్క్‌ దృష్టి సారించిన అత్యంత  కీలకమైన విభాగం మధుమేహం. భారతదేశంలో  మధుమేహుల చికిత్సకు తాజా చికిత్సావకాశం ఇది. ఈ విప్లవాత్మక జిటాప్లస్‌ పియోను ఆవిష్కరించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము.  భారతదేశంలో ఇది మొట్టమొదటిసారి. వయసుమీద పడిన మధుమేహ రోగుల చికిత్సకు అందుబాటు ధరలోని ప్రపంచశ్రేణి ఔషదంగా ఇది నిలుస్తుంది’’ అని అన్నారు.
 
వినూత్నమైన టెనెలిగ్లిప్టిన్‌+పియోగ్లిటజోన్‌ ఎఫ్‌డీసీని మార్కెట్‌కు తీసుకువస్తోన్న మొట్టమొదటి కంపెనీ గ్లెన్‌మార్క్‌. దీనికి డీసీజీఐ అనుమతి అందించింది. ఈ ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ టెనెలిగ్లిప్టిన్‌ మరియు పియోగ్లిటజోన్‌లను వేర్వేరుగా ఉపయోగించే రోగులలో గ్లిసెమిక్‌ నియంత్రణ మెరుగుపరిచి ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ తగ్గించేందుకు తోడ్పడుతుంది.