1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:35 IST)

దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధరలు

gold
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం దిగిరాగా, శుక్రవారం నాటి ధరల్లో మార్పు చోటుచేసుకుంది. శుక్రవారం ధరల ప్రకారం గ్రాము బంగారంపై రూ.160కు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు పది గ్రామాల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేరకు పెరిగి, రూ.53,780గా ఉంది. 
 
అలాగే, పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 మేరకు పెరిగి రూ.49,300 వద్ద ఉంది. ఇక వెండి ధర మాత్రం శుక్రవారం తగ్గింది. ఈ తగ్గుదల రూ.300 మేరకు ఉంది. ఫలితంగా కేజీ వెండి ధర రూ.73 వేలుగా ఉంది.