మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:46 IST)

ఏపీలో కొత్త జిల్లాల్లో 75 శాతానికి పెరిగిన భూముల మార్కెట్ విలువ

andhra pradesh map
ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కొత్త జిల్లాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువ కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా  కొత్తగా ఏర్పాటైన 11 జిల్లాలు, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పెంచిన భూముల ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
కొత్త జిల్లాలు ఏర్పాటైన రెండు రోజుల్లోనే ప్రత్యేక మార్కెట్ రివిజన్ పేరిట భూముల విలువను ప్రభుత్వం పెంచింది. ఇక మిగతా జిల్లాల్లో(రాష్ట్ర వ్యాప్తంగా) పెంచిన భూముల ధరలు ఆగష్టు నుంచి అమల్లోకి రానున్నాయి.
 
ఇకపోతే.. జాతీయ రహదారులు, స్థానిక పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు వంటి తదితర అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఆమేరకు ఆయా ప్రాంతాల్లో డిమాండ్ బట్టి భూముల మార్కెట్ విలువను 13-75 శాతం మేర పెంచినట్లు తెలిసింది. మార్కెట్ విలువ పెంచడంతో రెజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రానుంది.