మంగళవారం, 21 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 ఏప్రియల్ 2022 (22:45 IST)

సుగుణాలను విడిచిపెట్టనివి ఏవి?

gold
బంగారానికి పుటం పెట్టినా వన్నె మారదు. గంధపు చెక్కను ఎంత అరగదీసినా సువాసన విడిచిపెట్టదు. శంఖం భస్మమయినా తెలుపు మారదు. పాలు ఎంత మరిగినా రుచిపోదు. వజ్రాన్ని సానపెట్టి అరగదీసినా కాంతి తగ్గదు. దాత ఎంత ధనరాశి తగ్గినా దాతృత్వం విడిచిపెట్టడు.

 
వీరుడు శత్రువుల చేత నరకబడుతున్నప్పటికీ తన పరాక్రమాన్ని త్యజించడు. మంచివాడు ఎంత ప్రయాసపొందినా తన మర్యాద మాత్రం తప్పడు.