మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (15:50 IST)

అదానీ గ్రూప్ అదుర్స్... త్వరలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలోకి ఎంట్రీ

Adani
డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది అదానీ గ్రూప్. ఇప్పటికే సోలార్​ ఎనర్జీ, ఎయిర్​పోర్టులు, పోర్టులు లాంటి రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్​.. ఇప్పుడు డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాలలో ఎంట్రీ ఇవ్వనుంది. 2030 నాటికి డిఫెన్స్​ మోడర్నైజేషన్​ కోసం 300 బిలియన్​ డాలర్లను ఖర్చు పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. 
 
ఈ క్రమంలోనే బ్రిటన్​లోని కంపెనీలతో కలిసి ఈ రంగంలో పనిచేయాలనే డిసైడయ్యారు గౌతమ్‌ అదానీ. భారత్‌ పర్యటనలో ఉన్న ​బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్​తో చర్చలు కూడా జరిపారు.
 
సంపద వృద్ధిలో మస్క్ లాంటి వాళ్లనే వెనక్కి నెట్టారంటే.. అదానీ వ్యాపార చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 16.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో 50 బిలియన్‌ డాలర్లకు చేరింది. అలాగే ముకేశ్‌ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరిగింది. అంబానీతో పోలిస్తే అదానీ సంపద రెట్టింపు పెరిగింది.