1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ilayaraja Exclusive Interview his career

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

Ilayaraja interview
ప్రముఖ సంగీత దర్శకుడు, ఇసైజ్ఞాని ఇళయరాజా తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నారు. తనలాంటి వారు ఈ లోకంలో లేరని అన్నారు. పాండిత్యం ఉన్నవారు తమ గురించి తామే చెప్పుకోవాలి అని అన్నారు. లేకపోతే, ఎవరికీ తెలియదు. అలా నా గురించి నేను మాత్రమే చెప్పుకోవాలి. నా విషయానికి వస్తే, లోకంలో నాలాంటివారు లేరు. ఇకపై ఇలాంటి వారు కూడా వస్తారా అంటే రారు అనే చెబుతాను. నాకంటే ముందు నాలాంటివారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెబుతాను అని అన్నారు.
 
సినిమా సంగీతానికి సంబంధించి చాలా గొప్పవారు ఉన్నారు. అయితే, వాళ్లంతా కూడా ఎవరో ఒకరిని గురువుగా భావించి, వారి వద్ద నేర్చుకున్నారు. బాగా అనుభవం గడించిన తర్వాత వాళ్లు సంగీతం మొదలుపెట్టారు. కానీ నేను అలా కాదు. ఎవరి వద్దా నేర్చుకోలేదు. ఒక కుగ్రామంలో పుట్టి పెరిగాను. అక్కడ సంగీతం నేర్చుకునే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఆ దేవుడే. ఇది ఆయన ఇచ్చిన వరంగానే నేను భావిస్తూ ఉంటాను అని ఇళయరాజా అన్నారు. 
తర్వాతి కథనం
షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా