1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 మే 2025 (16:32 IST)

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

Jupiter Transit 2025
Jupiter Transit 2025
2025 సంవత్సరం.. గురు పరివర్తనం మే 14వ తేదీన జరుగనుంది. ఈ గురు పరివర్తనం కన్యారాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది. ప్రతి గ్రహాలు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక రాశిలో మరొక రాశికి చోటుచేసుకోవడం ఆచారం. ఈ గ్రహాల మార్పు 12 రాశివారి జీవితంలో దాని ప్రభావం మారుతుంది. ఆ రకంగా కొన్ని రాశివారికి శుభఫలాలు, కొన్ని రాశివారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.
 
గురు పరివర్తనం 2025 సంవత్సరం మే 14వ తేదీ జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10.30 గురుపరివర్తనం జరుగుతోంది. 2025 సంవత్సరం మే నెల వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతున్నాడు. ఈ మార్పు వల్ల గురు ప్రభావం తులాం, ధనుస్సు, కుంభరాశిపై వుంటుంది. 
 
గురు ప్రభావం మంచి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే ఈ గురు పరివర్తనం ద్వారా కన్యారాశికి లాభాలు చేకూరుతాయి. కన్యారాశికి పదో స్థానంలో గురు పరివర్తనం జరుగుతుంది. అలాంటి సందర్భంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం. 
 
ఇప్పటివరకు గురు వీక్షణ కారణంగా కన్యారాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. గురు పదోస్థానానికి చేరుకోవడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగం కోసం వేరొక ప్రదేశానికి వెళ్లడం, శిక్షణ సంస్థలు నిర్వహించే యోగం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులను అలంకరించడం జరుగుతుంది. 
 
అలాగే గురు పరివర్తనం కారణంగా ఉన్నత అధికారులకు సలహాలు ఇవ్వడం మానుకోవాలి. చేస్తున్న ఉద్యోగంలో అంకితభావం ముఖ్యం. కానీ ఆదాయానికి ఇబ్బంది వుండదు. 2, 4, 6 స్థానాలను గురు వీక్షించడం ద్వారా ధనాదాయానికి ఎలాంటి లోటు వుండదు. 
 
అలాగే ఈ గురు పరివర్తనం కారణంగా బంగారం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. సామాజంలో కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. కుటుంబంలో గౌరవం దక్కుతుంది. కుటుంబంలో ఐక్యతగా వుండేందుకు ప్రయత్నించండి. అందరితో కలుపుగోలు తనంగా మెలగడం మంచిది. 
 
భాగస్వామి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా వుంటుంది. సంతానం చదువుల్లో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే యోగం వస్తుంది. గురు పరివర్తనం కారణంగా కన్యారాశి వారికి ఆదాయానికి ఢోకా వుండదు. కనక వర్షం కురుస్తుంది. కన్యారాశికి ఈ కాలం సత్కాలం. పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో ఉద్యోగం చేస్తారు. మెరిట్‌లో సీటు దక్కుతుంది. వున్న ఉద్యోగం నుంచి మారినా.. కొత్త ఉద్యోగంలో స్థిరపడినా ఆదాయం బాగుంటుంది. పిల్లల పట్ల, కుటుంబీకుల పట్ల కఠినంగా వ్యవహరించకూడదు. 
 
విద్యార్థులకు గురు పరివర్తనం ఎలా వుంటుంది?
విద్యార్థులకు గురువు నాలుగో స్థానానికి రావడంతో విద్యలో రాణిస్తారు. చదువు మీద దృష్టి పెడతారు. ఒంటరిగా కూర్చుని చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీదైనా రంగంలో రాణిస్తారు. 
 
మహిళలకు విద్యార్థులకు గురు పరివర్తనం ఎలా వుంటుంది?
మహిళలు అత్తగారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. ఆదాయానికి కొదవవుండదు. రుణాలను తీర్చుతారు. నిర్మాణ రంగం, ఇంజనీరింగ్ రంగంలో పెట్టుబడి పెట్టడం మంచిది. వ్యాపార యోగం వుంటుంది. జాతక దశాబుక్తి ప్రకారం ఏ వ్యాపారం కలిసొస్తుందో చూసుకుని ప్రారంభించడం మంచిది. ఈ గురు పరివర్తనం కారణంగా 75శాతం సంతోషం, ఆదాయం 80తో కన్యారాశి వారికి అంతా అనుకూలంగా వుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గురు పరివర్తనంలో హనుమంతుడిని పూజించడం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.