మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహార లావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆచితూచి అడుగేయండి. తొందరపాటు నిర్ణయం తగదు. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. శుక్రవారం నాడు ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మీ సామర్ధ్యంపై గురికుదురుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. వాహనసౌఖ్యం, ధనలాభం ఉన్నాయి. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. నూతన వ్యాపారాలు చేపడతారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. గృహంలో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను వెంటనే తెలియజేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. వాహనం, విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి అతి చొరవ ఇబ్బంది కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం అన్ని విధాలా కలిసివచ్చే సమయం. నిరుత్సాహం వీడి శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయారు ఏర్పడతాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు నెలకొంటాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. శుభకార్యం నిశ్చ, యమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యవహర లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహస్థితి అంత అనుకూలం కాదు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. రావలసిన ధనం లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సోమవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీపై కొందరి వ్యాఖ్యలు మంచి ప్రభావం చూపుతాయి. మనోబలంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. సన్నిహితులతో తరుచుగా సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. కీలక సమావేశంలో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్తలు వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలెదురైనా ధైర్యంగా ముందుకెడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. గురువారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. సంతానానికి ఉద్యోగయోగం. చేపట్టిన ఉపాధి పథకంలో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగాసాగుతాయి. అధికారులకు హోదా మార్పు. ఉపాధ్యాయులకు పనిభారం. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా అనుకూలమే. కీలక వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. ఉత్సాహంగా శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బంధుమిత్రులతో తరచుగా సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అవివాహితులు శుభవార్తలు వింటారు. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. మీ బాధ్యతలపైనే దృష్టి పెట్టండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీ కలుపుగోలుతనం అందరికీ సంతోషం కలిగిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యం నిశ్చమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ఆది, సోమ వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలదాయకం. మనోధైర్యంతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థలో మదుపు తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కీలక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలి. సలహాలు, సాయం ఆశించవద్దు. వ్యతిరేకులు తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. గృహనిర్మాణం పూర్తవుతుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. మంగళవారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదామార్పు, రిటైర్డు ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేయగల్గుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతంది. శనివారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాదోపవాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను నమ్మవద్దు. త్వరలో శుభవార్తలు వింటారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది.