ఆదివారం, 16 మార్చి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 15 మార్చి 2025 (17:17 IST)

16-03-2025 నుంచి 22-03-2025 వరకు మీ వార ఫలితాలు-ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి.

Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకూలతలు అంతంతమాత్రమే. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ఆదాయం నిరాశాజనకం. పురోభివృద్ధి లేక నిస్తేజానికి లోనవుతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. బుధవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో శుభవార్త వింటారు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. వ్యాపారాలపై దృష్టి పెడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. విద్యారులు మానసికంగా స్థిమితపడతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
 
కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మొదలు పెట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. శనివారం నాడు ప్రముఖుల తీరును గమనించి మెలగండి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. సంతానానికి శుభఫలితాలున్నాయి. కీలకపత్రాలు అందుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. దస్త్రం వేడుకకు ముహుర్తం నిశ్చయమవుతుంది. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభవార్త వింటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వాహనయోగం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడతాయి. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో ఆటుపోట్లను తట్టుకుంటారు. మీ పథకాలు మచి ఫలితాలిస్తాయి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. లక్ష్యం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. బంధువులతో సంబంధాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదా మార్పు, అదనపు బాధ్యతలు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. దంపతులు అవగాహనతో మెలగాలి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్తయత్నాలు మొదలెడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. రిటర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. శనివారం నాడు కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. లౌక్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పాతపరిచయస్తులతో సంభాషిస్తారు. సంతానం దూకుడు కట్టడి చేయండి. పన్ను పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట అధికం. చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం వేడుక నిర్విఘ్నంగా సాగుతుంది. విదేశీ సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. పట్టుదలతో ముందుకు సాగండి. ఎదుటివారి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆదాయ వ్యయాలకు పొందన ఉండదు. ధనసమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. సోమవారం నాడు ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ప్రయత్న పూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు మరింత చేరువవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆదివారం నాడు పనులు పురమాయించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోండి. దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాన్ని సాధిస్తారు. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యల తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యవహారలావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణవేదికలు అన్వేషిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు కొందరు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. మీ సామర్ధ్యంపై నమ్మకం కుదురుతుంది. ఏకాగ్రతతో యత్నాలు సాగించండి. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. శుక్రవారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి ఆక్కౌంటెంట్లకు పనిభారం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు సంతృప్తినస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. శనివారం నాడు అనవసర విషయాల జోలికి పోవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. సంతానం కృషి ఫలిస్తుంది. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్నతరహా వ్యాపారులకు ఆశాజనకం. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు చక్కబడతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా ఖర్చుచేయండి. ఆదివారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని వదులు కోవద్దు. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకుంటారు.