సోమవారం, 14 ఏప్రియల్ 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 12 ఏప్రియల్ 2025 (19:25 IST)

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం కొంతమేరకు అనుకూలం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు నియంత్రించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులు మరింత శ్రద్ధగా పనిచేయాలి. అధికారుల తీరును గమనించి మెలగండి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురికుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కీలక విషయాల్లో స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధ సేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. చిరువ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలకు శ్రీకారం చుడతారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. కీలక అంశాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సన్నిహితులతో సంభాషణ మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఆదివారం నాడు ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య స్వల్ప కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. నోటీసులు అందుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు సదావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలు, పెట్టుబడులకు తగిన సమయం. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ కృషి ఫలిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఆదాయానికి స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సోమవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు మంచి ఫలితాలిస్తాయి. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగపరంగా విశేష ఫలితాలున్నాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రయాణం తలపెడతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మంగళ, బుధవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కీలక విషయాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. బెట్టింగుల జోలికి పోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహసంచారం సామాన్యంగా ఉంది. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. కార్యసాధనకు మరింత శ్రమించాలి. మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా అడుగు ముందుకేస్తారు. పెద్దల ప్రోత్సాహం, అయిన వారి సాయం అందుకుంటారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది.. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. ముఖ్యమైన చెల్లింపుల్లో జాప్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ పనితారు స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సంతానం విజయం ఉత్సాహపరుస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. మంగళవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. కీలక వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. వ్యాపారపరంగా విశేషఫలితాలున్నాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. బిల్డర్లు, కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మనోభీష్టం నెరవేరుతుంది. వాక్పటిమతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. ఎవరినీ అతిగా నమ్మొవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. గురువారం నాడు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. సంస్థల స్థాపనలకు అనుమతులు లభిస్తాయి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు పదవీయోగం. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలమే. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యంతో లక్ష్యసాధనకు శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. పొదుపుగా ధనం వ్యయం చేయండి. గృహంలో ప్రశాంతంగా నెలకొంటుంది. శుక్ర, శనివారాల్లో గుట్టుగా మెలగండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురియావద్దు. మీ కార్యక్రమాలకు కొందరు అవరోధం కలిగిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆదివారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు బంధుత్వాలవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు చేపడతారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలమైన కాలం సమీపించింది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ కృషి తక్షణమే ఫలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. వాహనం, విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మంగళవారం వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట అధికం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. శ్రమ ఫలించకున్నా నిరుత్సాహపడవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. గురువారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.