శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (16:32 IST)

క్రెడిట్ కార్డును వారం రోజుల్లో క్లోజ్ చేయండి, లేదంటే రోజుకు రూ.500 ఫైన్

cards
ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ కార్డులను తమ స్థాయికి తగ్గినట్టుగా వినియోగిస్తున్నారు. ఇష్టం లేదనుకునేవారు ఈ కార్డులను క్లోజ్ చేసుకోవచ్చు. అయితే, బ్యాంకులు మాత్రం వివిధ కారణాలు చూపి వాటిని క్లోజ్ చేయకుండా నానా తిప్పలు పెడుతుంటాయి. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు వీలుగా భారత రిజర్వు బ్యాంకు ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకునిరానుంది. దాని వల్ల క్రెడిట్ కార్డు వినియోగదారులకు చాలా వరకు కష్టాలు తొలగనున్నాయి. 
 
ఇంతకూ ఆ రూల్ ఏంటంటే.. ముందుగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలనుకునే వ్యక్తి.. సంబంధిత బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్బీఐ కొత్త రూల్ ప్రకారం అలా కార్డు క్లోజింగ్ అప్లికేషన్ పెట్టుకున్న ఏడు రోజుల్లో సదరు బ్యాంకు ఎట్టిపరిస్థితుల్లో క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 
 
ఒకవేళ పొరపాటున క్రెడిట్ కార్డును బ్యాంకు క్లోజ్ చేయలేకపోతే.. గడువు ముగిసిన(ఏడు రోజుల) తర్వాత పెనాల్టీ రూపంలో రోజుకు రూ.500 చొప్పున కస్టమర్‌కు బ్యాంకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదహరణకు మీరు క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలని బ్యాంకు అధికారుల వద్ద దరఖాస్తు చేశారనుకోండి. కానీ బ్యాంకు అధికారులు 20 రోజుల తర్వాత దాన్ని క్లోజ్ చేశారు. 
 
ఇటువంటి సందర్భంలో క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడానికి 13రోజుల సమయాన్ని ఎక్కువగా తీసుకున్నారు కాబట్టి.. పెనాల్టీ రూపంలో రూ.6,500 బ్యాంకు అధికారులే మీకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. క్రెడిట్ కార్డు క్లోజింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు.. ఔట్ స్టాండింగ్ అమౌంట్‌ను సదరు కస్టమర్ పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది.