Reliance launches JioBook.. స్పెసిఫికేషన్స్ ఇవే
దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో.. ల్యాప్ టాప్ రంగంలో మరో సంచలనానికి తెరతీసింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్‌లో జియో తన తొలి ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. ఈ ల్యాప్‌టాప్‌కు జియోబుక్ అని పేరు కూడా పెట్టింది. ఈ ల్యాప్ టాప్ ధర రూ.15,799గా నిర్ణయించింది.
బడ్జెట్ ధరలో ఈ ల్యాప్‌టాప్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ల్యాప్ టాప్ బాగా పనిచేస్తుంది. జియోఓఎస్ ఆధారిత జియోబుక్‌లో థర్డ్ పార్టీ యాప్స్‌కు యాక్సెస్ వుంటుంది. ఎంబెడెడ్ జియో సిమ్ కార్డు.. 5జీ సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుంది.
స్పెసిఫికేన్స్..
ఆండ్రెనో 610 జీపీయూ స్నాప్‌డ్రాగన్ 665 ఎస్ఓసీ ప్రాసెసర్
2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
11.6 అంగుళాల డిస్ ప్లే
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
యూఎస్‌బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్‌డీఎం పోర్ట్ సపోర్ట్
1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఇది పనిచేస్తుంది.