శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (16:01 IST)

యూజర్లకు షాకిచ్చిన జియో- డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌?

reliance jio
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో యూజర్లకు షాక్. ఇప్పటి వరకు జియో యూజర్లు రీచార్జ్‌ చేసుకుంటే కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా వచ్చేది.

కానీ తాజాగా కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్‌లలో డిస్నీ+ హాట్‌ స్టార్‌ని తొలగించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి జియో అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని ప్లాన్‌లో ఉన్న ఓటీటీ ఆఫర్‌ను చూపించడం లేదు.

కస్టమర్లు ఇప్పుడిక డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్‌ పొందాలంటే కేవలం రెండు ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అనగా రూ.1499, రూ.4199 రీచార్జ్‌తో మాత్రమే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు.

జియో యూజర్లు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడాలంటే ప్రత్యేక రీచార్జ్‌ చేసుకోవాల్సిందే మరి.