సోమవారం, 11 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (13:16 IST)

5జీ వేగంలో అదరగొట్టిన జియో.. తర్వాతి స్థానంలో ఎయిర్ టెల్

5gspectrum
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో 5జీ వేగంలో అదరగొట్టింది. 5జీ వేగంలో అగ్రస్థానంలో నిలిచింది. 5జీ డేటా వేగం గణాంకాలను ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా విడుదల చేసింది. దీని ప్రకారం రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసింది. తర్వాతి స్థానాల్లో ఎయిర్ టెల్ నిలిచింది. 
 
ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. పట్టణాల వారీగానూ టెలికం నెట్ వర్క్ ల 5జీ డౌన్ లోడ్ లో వ్యత్యాసాలు ఉన్నాయి. అక్టోబర్ 1న 5జీ సేవలు మొదలు కాగా, దీనికంటే ముందే టెలికం ఆపరేటర్లు తమ నెట్ వర్క్‌లను పరీక్షించినట్టు ఊక్లా తెలిపింది.