గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (17:57 IST)

ట్వంటీ-20 ప్రపంచ కప్‌ సంచలనం.. విండీస్‌పై ఐర్లాండ్ గెలుపు

ireland
ireland
ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ జట్టు వెస్టిండీస్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఐర్లాండ్ సూపర్-12 దశలో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఈ సంచలన విజయం నమోదైంది. 
 
ఈ విజయంతో ఐర్లాండ్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండుసార్లు టైటిల్ గెలిచిన విండీస్‌ను ఇంటికి పంపినట్లైంది. ఐర్లాండ్ జట్టు ఇప్పటిదాకా 7 పర్యాయాలు టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనగా, తొలి దశను అధిగమించడం ఇది రెండోసారి. 
 
హోబర్ట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో డెలానీ 3 వికెట్లు తీశాడు. 
 
అనంతరం, ఓ మోస్తరు లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ అదరగొట్టింది. కేవలం ఒక వికెట్ నష్టపోయి 17.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. సీనియర్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.