శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (20:26 IST)

ట్వంటీ-20 ప్రపంచ కప్‌.. జస్‌ప్రీత్ బుమ్రా అవుట్?

Jasprit Bumrah
ఆస్ట్రేలియాలో జరిగే ట్వంటీ-20 ప్రపంచ కప్‌కు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి వుండే అవకాశాలు లేనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడే ఆయన ఇప్పటికే ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో జ‌రిగిన చివ‌రి రెండు టీ20ల్లో బుమ్రా బౌలింగ్ చేశాడు.
 
అయితే బుధ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌కు బుమ్రా దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రాక్టీస్‌లో వున్న బుమ్రాకు వెన్నునొప్పి వ‌చ్చిన‌ట్లు ఫిర్యాదు చేశాడు. 
 
బీసీసీఐ మెడిక‌ల్ బృందం అత‌న్ని ప‌రీక్షిస్తోంది. అయితే అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాలో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బుమ్రా ఆడేది లేనిది అనుమానమే.
 
మరోవైపు సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో బుమ్రా ఆడకపోవడంతో కెప్టెన్ రోహిత్ స్పందించాడు. బుమ్రాకు వెన్ను నొప్పి తిరగబెట్టిందని, అందుకే అతన్ని ఈ మ్యాచ్‌కు దూరంగా పెట్టామని హిట్ మ్యాన్ తెలిపాడు.